అమ‌రావ‌తి  : రాష్ట్రంలో క‌రోనాతో ప్ర‌తి రోజు వేల సంఖ్య‌లో బాధితులు ఆసుప‌త్రుల‌కు వెళ్తున్నారు.అయితే ప్ర‌తి హ‌స్ప‌ట‌ల్‌లో బెడ్లు లేవ‌నే బోర్డులు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.ఒక వేళ ఎలాగోలా బెడ్ దొరికింద‌నుకుంటే అక్క‌డ ఆక్సిజ‌న్ లేక నానా అవ‌స్థ‌లు ప‌డాల్సి వ‌స్తుంది.అయితే ఇలాంటి స‌మ‌స్య‌లు త‌న దృష్టికి రావ‌డంతో రాజ‌మండ్రి ఎంపీ భ‌ర‌త్ వినూత్న ఆలోచ‌న‌కు శ్రీకారం చుట్టారు.ఏపీఎస్ ఆర్టీసీ అధికారుల‌తో చ‌ర్చించి బ‌స్సుల‌ను ప్రాణ‌వాయువు ర‌థ‌చ‌క్రాలుగా మార్చే ఆలోచ‌న చేశారు.ఏపీఎస్ ఆర్టీసీ కూడా క‌రోనా బాధితుల‌కు త‌మవంతు సాయం చేసేందుకు ముందుకు వ‌చ్చింది. ఆర్టీసీ వెన్నెల ఏసీ బ‌స్సుల‌ను అత్య‌వ‌స‌ర వైద్య సేవ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డేలా వాటిని మారుస్తున్నారు.ఒక్కొక్క బ‌స్సులో 36 సీట్లు ఉంటాయి.వీటిని ఆరు ప‌డ‌క‌లుగా మార్చి వాటిలో ప్ర‌తి బెడ్‌కి ఆక్సిజ‌న్ సిలిండ‌ర్‌ని అమ‌ర్చారు.దీనితో పాటు ఒక మినీ ఇంటెన్సీవ్ కేర్ యూనిట్ ని ఏర్పాటు చేశారు.
మొద‌ట‌గా ఈ బ‌స్సుల‌ను రాజ‌మండ్రిలో ట్రైయిల్ ర‌న్ నిర్వ‌హించ‌నున్నారు.స్థానికి ఎంపీ మార్గాని భ‌ర‌త్ సూచ‌న‌ల మేర‌కు రాజ‌మండ్రి ఆర్టీసీ గ్యారేజ్‌లో రెండు వెన్నెల బ‌స్సుల‌ను వైద్య సేవ‌ల‌కు ఉప‌యోగప‌డేలా మారుస్తున్నారు.ఈ బస్సుల్లో ఇమిడే విధంగా ఉండే  ఆక్సిజన్ సిలెండర్లను ప్రత్యేకంగా విశాఖపట్నం నుంచి తీసుకువచ్చారు.కోవిడ్ బాధితునకు సత్వరమే ఆక్సిజన్ అందజేసి ప్రాణాపాయ స్థితి నుంచి  నుంచి ఆదుకునేందుకు ఎంతగానో ఈ ప్రాణ‌వాయు ర‌థ‌చ‌క్రాలు దోహదపడతాయి. క‌రోనా పాజిటివ్ వ‌చ్చి ఆక్సిజ‌న్ అంద‌క ఇబ్బందిపడే వారికి అత్య‌వ‌స‌రంగా ఈ బ‌స్సుల్లో చికిత్స అందిస్తారు.ఈలోగా ఏ ఆసుప‌త్రిలో అయినా బెడ్ దొర‌క‌గానే వారిని ఆ ఆసుప‌త్రికి షిఫ్ట్ చేసి వైద్య‌సేవ‌లు అందించ‌నున్నారు. అయితే ఈ బ‌స్సుల‌కు "జ‌గ‌న‌న్న ప్రాణ‌వాయువు ర‌థ చ‌క్రాలు"గా రూప‌క‌ల్ప‌న చేసిన‌ట్లు ఎంపీ మార్గాని భ‌ర‌త్ తెలిపారు.
మొట్టమొదటి సారిగా రాజమహేంద్రవరం నగరంలో కోవిడ్ బాధితులకు బస్సులో వైద్యం అందించే విధానం విజయవంతమైతే దీనిని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకు వెళ్ళతానని చెప్పారు. తన ఆలోచనల నుంచి ఉద్భవించిన ఈ కార్యక్రమం ద్వారా కోవిడ్ బాధితులకు న్యాయం జరిగితే అంతకంటే ఆనందం మరొకటి ఉండదన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: