ప్ర‌స్తుతం క‌రోనా విల‌య తాండవం చేస్తుంది. రోజుకు కొన్ని వేల మంది పిట్టల్లా రాలిపోతున్నారు. అస‌లు ఏం జ‌రుగుతుందో అర్ధం కాని ప‌రిస్థితి. రానున్న రోజుల‌లో థ‌ర్డ్ వేవ్ కూడా వ‌స్తుంద‌ని హెచ్చ‌రిక‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌లు భ‌య‌ప‌డిపోతున్నారు. సాధారణ దగ్గు వచ్చినా.. జ్వరం వచ్చినా.. కరోనానేమోనని కంగారు పడుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తే ఫీజుల మోత మోగుతుందని... ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే పట్టించుకోరన్న భయంతో.. ఇంట్లోనే ఉండి భయం భయంగా బతుకుతున్నారు. ఇలాంటి క్ర‌మంలో హీరోయిన్ నమిత కీలక సూచన చేశారు.  "మీకు కోవిడ్ లక్షణాలున్నాయా? ఐతే ఆందోళన చెందకండి. మీరు ఇంట్లో ఉంటూనే ఉచితంగా డాక్టర్‌ను సంప్రదింవచ్చు. భారతీయ యువ మోర్చా హెల్ప్ లైన్ నెంబర్ర 080 68173286 నెంబర్‌కు కాల్ చేస్తే వైద్య నిపుణులు సలహాలు, సూచనలు ఇస్తారు." అని నమిత తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: