ఏపీలో కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తుంది. రోజువారి కేసుల్లో పాజిటివ్ కేసులు 22వేలు దాటెస్తున్నాయి. గత 24 గంటల్లో 22,399 మందికి పాజిటివ్ గా తేలింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,66,785కి చేరింది. దీంతో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి వారిపై ఆంక్షలు విధించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్‌ పరీక్షలు తప్పనిసరిగా చేయాలన్న నిబంధన విధించింది. ఎయిర్‌పోర్టు అథార్టీ ఆఫ్‌ ఇండియా ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయి క్వారంటైన్‌ గైడ్‌లైన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో భాగంగా కోవిడ్‌ లక్షణాలతో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు విధిగా 14 రోజుల పాటు క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉండాలని సూచించింది. మిగిలిన వారు హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుందని.. అలాగే, రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులు 72 గంటల ముందు కోవిడ్‌ నెగెటివ్‌ ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుందని పేర్కోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: