కొవిషీల్డ్‌ టీకా డోసుల మధ్య వ్యవధిని ప్రస్తుతమున్న 6-8 వారాల నుంచి 12-16 వారాలకు పెంచాలని నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యునైజేషన్‌ (ఎన్‌టీఏజీఐ) సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ఈ సిఫార్సులను అమెరికా అంటువ్యాధుల నిపుణుడు, వైట్‌హౌస్ ప్రధాన వైద్య సలహాదారు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ సమర్ధించారు. రెండు డోసుల మ‌ధ్య గ్యాప్ ఈ స్థాయిలో పెంచ‌డం వ‌ల్ల అది టీకా సామ‌ర్థ్యంపై ప్ర‌తికూల ప్ర‌భావం కూడా ఏమీ చూప‌ద‌ని అన్నారు. "ఇండియాలో ఉన్న‌ట్లుగా మీరు క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉంటే సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఎక్కువ మందికి వ్యాక్సిన్లు వేసే ప్ర‌యత్నం చేయాలి. ఆ ర‌కంగా చూస్తే ఇది మంచి నిర్ణ‌య‌మే. ఇక మీ వ్యాక్సిన్ల ఉత్ప‌త్త సామ‌ర్థ్యాన్ని పెంచుకుంటూనే ఇత‌ర దేశాలు, కంపెనీల‌తో ఒప్పందాలు కుదుర్చుకోవాలి" అని ఫౌచీ సూచించారు. ఇక ఇక భారత్‌లో ప్రస్తుతం వైరస్ చాలా తీవ్రంగా ఉందని, ఆ దేశ ప్రయాణాలపై విధించిన నిషేధం ప్రస్తుతం ఎత్తివేయడం చాలా కష్టమని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: