కోవిడ్ సంక్షోభం నుంచి బయటపడటానికి కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా విదేశీ వ్యాక్సిన్‌లకూ అనుమతులు మంజూరు చేస్తోంది. ఇప్పటికే రష్యా అభివృద్ధి చేసిన టీకాను అత్యవసర వినియోగానికి భారత్ అనుమతించింది. ఈ టీకాలను దేశీయంగా ఏడాదికి 85 కోట్ల డోస్‌లను ఉత్పత్తి చేయనున్నారు. స్పుత్నిక్-వీ వచ్చేవారమే భారత్‌లో అందుబాటులోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్ లో స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ధరను నిర్ణయించింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ ప్రకటించింది. ఒక్కో డోస్ ధర రూ.995గా నిర్ణయించింది. అదే 5 శాతం జీఎస్టీతో కలిపి ఒక డోసు ధరను రూ.995.40లుగా నిర్ణయించింది. అయితే, ఇది దిగుమతి చేసుకున్న టీకా ధర మాత్రమేనని తెలిపింది. ఎందుకంటే దిగుమతి చేసుకున్న మోతాదుల ధరలో మోతాదుకు 5 శాతం జీఎస్టీ ఉంటుంది. 91.6 శాతం సామర్థ్యం కలిగిన స్పుత్నిక్ వి, భారతదేశంలో ఉపయోగం కోసం ఆమోదించిన మూడవ టీకా . దేశీయంగా స్పుత్నిక్-వి వ్యాక్సిన్ తయారుచేయడం ద్వారా దాని ధర తగ్గే ఛాన్స్ ఉంది. వారం రోజుల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో స్పుత్నిక్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: