ఇప్పుడు మన టాలీవుడ్ నుంచి రానున్న కొన్ని మోస్ట్ అవైటెడ్ కాంబోస్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు సూపర్ స్టార్ మహేష్ ల నుంచి వస్తున్న హ్యాట్రిక్ కాంబో కూడా ఒకటి. ఈ చిత్రంపై ఎనలేని అంచనాలు కూడా నెలకొన్నాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ సినిమా అంటే ఫ్యామిలీ వ్యాల్యూస్, పంచ్ డైలాగ్స్ , ప్రాసలు గుర్తొస్తాయి. సింపుల్ కథను తనదైన శైలిలో తెరకెక్కించి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకుంటారు త్రివిక్రమ్. అయితే ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు. దీనిని పురస్కరించుకుని త్రివిక్రమ్ శ్రీనివాస్ - మహేశ్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న మూవీకి సంబంధించి.. సినిమా టైటిల్ అనౌన్స్ చేయనున్నారు చిత్ర బృందం. ఈ మేరకు మూవీ లాంచ్ చేయనున్నారు చిత్ర బృందం. అలాగే సర్కారు వారి పాట సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు. దీని బట్టి చూస్తే మహేష్ ఫ్యాన్స్ కు ఒకే రోజు ట్రిపుల్ ధమాకా ఖాయం అనిపిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: