ప్రస్తుతం మనం అందరం ఎలాంటి పరిస్ధుతుల మధ్య ఉన్నామో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కరోనా అనే పెను భూతం మనల్ని పట్టి పీడిస్తుంది. కరోనా వైరస్‌ మారణహోమం సృష్టిస్తున్న ప్రస్తుత తరుణంలో దానిని అరికట్టేందుకు దేశమంతా పోరాడుతోంది. ప్రభుత్వాలు ప్రజలు ఎక్కడికి కదలకుండా ఇంట్లోనే ఉండాలని లాక్‌డౌన్‌ ప్రకటించాయి. కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా జనాలు తమను తాము రక్షించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే చిత్తూరు జిల్లా లోని పలు మండలాలు మరియు గ్రామాల్లో జనాలు ఇళ్లు ఖాళీ చేసి..పంట పొలాలకు వెళ్లి చెట్ల కింద ఉంటున్నారు. పొలాల వద్ద ఉన్న రేకుల షెడ్లు, గుడిసెలు, తాత్కాలిక ఇళ్లలో ఉంటున్నారు. రోజు కొత్త వారు గ్రామాల్లోకి వస్తున్న నేపథ్యంలో కరోనా వైరస్ వస్తుందని..అందుకే గ్రామాల్లో జనాలు ఉండటం కంటే పొలాల్లో ఉండటం బెటర్ అన్నట్లుగా జనాలు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: