ఇండియాలో కరోనా పాజిటివిటీ రేటు క్రమ క్రమంగా తగ్గుతుందని కేంద్ర ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి ల‌వ్ అగ‌ర్వాల్ తెలిపారు. దేశంలో కరోనా వైర‌స్ నియంత్ర‌ణ కోసం ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లు స‌త్ఫ‌లితాలు ఇస్తున్న‌ట్లు ల‌వ్ అగ‌ర్వాల్ తెలిపారు. ఇండియాలో గ‌త వారం పాజిటివిటీ రేటు 21.9 శాతంగా ఉంద‌ని, అయితే ఇప్పుడు ఆ రేటు 19.8 శాతానికి త‌గ్గిన‌ట్లు తెలిపారు. ఢిల్లీ, చ‌త్తీస్‌ఘ‌డ్‌, డ‌మ‌న్ అండ్ డయూ, హ‌ర్యానా, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో అత్య‌ధిక స్థాయిలో వైర‌స్ పాజిటివిటీ రేటు క్రమ క్రమంగా త‌గ్గింద‌ని ఆయ‌న తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: