నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును పోలీసులు సీఐడీ కోర్టులో హాజరుపరిచారు. హైకోర్టు సూచన మేరకు ఆయన్ను గుంటూరులోని సీఐడీ న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పోలీసులు రిమాండ్‌ రిపోర్టును జడ్జికి అందజేశారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సీఐడీ పోలీసులపై న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. తన కాళ్లకు గాయాలయ్యాయని, పోలీసులు తనను కొట్టడం వల్లే గాయపడ్డానని రఘురామకృష్ణరాజు సీఐడీ కోర్టు న్యాయమూర్తికి తెలియజేశారు. గత రాత్రి తనను వేధింపులకు గురిచేశారని, అరికాళ్లు వాచిపోయేలా కొట్టారని వివరించారు. ఈ మేరకు నాలుగు పేజీల లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు.అటు, రఘురామకృష్ణరాజు తనకు బెయిల్ మంజూరు చేయాలని ఓ పిటిషన్, అత్యవసర వైద్యసాయం కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రఘురామకు తగిలిన గాయాలను చూసి రిమాండ్ నివేదికను పెండింగ్ లో ఉంచిన న్యాయస్థానం... ఆయనను ఆసుపత్రికి తరలించాలని ఆదేశింది.



 

మరింత సమాచారం తెలుసుకోండి: