దేశం మొత్తం లాక్ డౌన్ కారణంగా కరోనా నుండి క్రమక్రమంగా కోలుకుంటుంది కానీ ఒక్క ఏపీ లో మాత్రం కరోనా కేసులు ఎప్పటిలాగానే నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో లాక్ డౌన్ లేదు కానీ కర్ఫ్యూ కొనసాగుతుంది. అందువల్ల కేసుల కట్టడి కావడం లేదు అనే భావన ఉంది. లాక్ డౌన్ ప్రకటిస్తే తప్ప పరిస్థితి అదుపులోకి వచ్చేలా లేదు. వైస్ జగన్ త్వరలోనే దీని గురించి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక గడిచిన 24 గంటల్లో 20 వేలకు పైగా కేసులు నమోదవ్వడం తో మరణాల సంఖ్య సైతం భారీగానే ఉంది. ఇక జగన్ నిర్లక్ష్యం వల్లే ఇదంతా అవుతుంది అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మరో వైపు జగన్ సీఎం పదవికి రాజీనామా చేసి అయన భార్య భారతి కి పగ్గాలు అప్పగిస్తే పరిస్థితిలో ఏమైనా మార్పు వస్తుందేమో అంటూ బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: