పశ్చిమ బంగాల్లో ముగ్గురు మంత్రులను సీబీఐ అదుపులోకి తీసుకుంది. మంత్రులు ఫిర్హాద్ హకీం, సుబ్రతా ముఖర్జీని అదుపులోకి తీసుకుంది. శారదా గ్రూప్ కుంభకోణం కేసులో మంత్రులను విచారణకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే మదన్ మిత్రా, మాజీ మేయర్ సోవన్ ఛటర్జీమంత్రులు, ఎమ్మెల్యే, మాజీ మేయర్‌లను సైతం అదుపులోకి తీసుకుని cbi కార్యాలయానికి తరలించారు.

ఆ నాటి నార‌ద స్టింగ్ టేపుల్లో ఉన్న‌వారిలో ఫిర్‌హ‌ద్ హ‌కీమ్‌, ముఖుల్ రాయ్‌, సౌగ‌త్ రాయ్‌, క‌కోలీ ఘోష్ ద‌స్తీదార్‌, సుల్తాన్ అహ్మ‌ద్‌, సుబ్ర‌తా ముఖ‌ర్జీ, సువేందు అధికారి, సోవ‌న్ చ‌ట‌ర్జీ, అపురూప పోదార్‌, మ‌ద‌న్ మిత్ర‌, ఇక్బాల్ అహ్మ‌ద్‌, ప్ర‌సూన్ బెన‌ర్జీ, మీర్జాలు ఉన్నారు. ఈ కేసులో సీబీఐ విచార‌ణ చేప‌ట్టాల‌ని 2017 మార్చి 17న కోల్‌క‌తా హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసులో నిందితులైన‌వారిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని కూడా ఆదేశించింది. అయితే ఆ ఏడాది ఏప్రిల్ 17వ తేదీన కేసులో ఉన్న అంద‌రిపై ఐపీసీ 120బీ ప్ర‌కారం కేసు బుక్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: