ఆస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌కు బెయిల్‌ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టులో నేడు విచారణ పూర్తయ్యింది. వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌ను హైద‌రాబాద్‌ నాంప‌ల్లిలోని సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో ఏపీ సీఎం జగన్‌ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, బెయిల్‌ రద్దు చేసి వేగంగా విచారణ చేపట్టాలని పిటిష‌నర్‌ కోర్టును కోరారు. దీంతో నేడు విచారణ జరగగా.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జగన్ బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ కృష్ణం రాజు పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేసేందుకు మరోసారి గడువు కావాలంటూ జగన్, సీబీఐ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. దీంతో కౌంటర్ దాఖలు చేసేందుకు జగన్, సీబీఐకి కోర్టు చివరి అవకాశం ఇస్తూ విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: