కరోనా మహమ్మారిని అరికట్టడానికి జగన్ ప్రభుత్వం భారీగానే నిధులు ఖర్చు చేస్తోంది.  ఇప్పటి వరకూ కరోనా ను అరికట్టడం కోసం 2229 కోట్ల పైగా ఖర్చు పెట్టిందట.  2020 ఫిబ్రవరి 15 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క వైరాలజీ ల్యాబొరేటరీ కూడా లేదు.  కరోనా వెలుగులోకి వచ్చిన కొత్త లో హైదరాబాద్  గాంధీ ఆస్పత్రికి నమూనాలు పంపించాల్సిన పరిస్థితి. అయితే, ఆ తర్వాత రాష్ట్రాల్లోనే లాబ్స్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దాదాపుగా రోజుకి లక్షకి పైగా కరోనా నమూనాలని పరీక్షిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14 ల్యాబొరేటరీలను ఏర్పాటు చేశారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: