బ్యాంకు కస్టమర్లకు ఆర్బీఐ ఓ కీలక ప్రకటన చేసింది.  వచ్చే ఆదివారం ఆన్‌లైన్‌ లావాదేవీల (నెఫ్ట్) సేవల్లో అంతరాయం ఏర్పడనుంది. మే 23వ తేదీన నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT) సర్వీసులు 14 గంటల పాటు నిలిపివేస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తెలిపింది. ఈ విషయాన్ని ఆర్బీఐ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. సాంకేతిక కారణాలతో ఈ సేవలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. "నెఫ్ట్‌ పనితీరును మరింత మెరుగుపర్చడం కోసం మే 22న వ్యాపార వేళలు ముగిసిన తర్వాత ఈ సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక అప్‌డేషన్‌ చేపడుతున్నాం. అందువల్ల మే 23వ తేదీన 00.01 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నెఫ్ట్‌ సేవలు అందుబాటులో ఉండవు" అంటూ ట్వీట్ పోస్ట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: