నర్సాపురం ఎంపీ రఘురామను శుక్రవారం సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే రఘురామ సుప్రీం కోర్టులో వైద్య పరీక్షలపై పిటిషన్ దాఖలు చేయగా.. సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. వైద్య పరీక్షల కోసం ఆయన్ను సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది. ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారని.. వైద్య పరీక్షల పర్యవేక్షణకు జ్యుడీషియల్ అధికారిని నియమించాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. వైద్య పరీక్షల్ని వీడియోగ్రఫీ చేసి సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. వైద్య పరీక్షల ఖర్చు ఎంపీనే భరించాలంది. అలాగే ఆయన వేసిన బెయిల్ పిటిషన్ శుక్రవారానికి వాయిదా వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: