కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ.. కొన్ని రంగాలు మాత్రం తమ సేవల్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నాయి. అందులో బ్యాంకింగ్‌ రంగం ఒకటి. బ్యాంకు ఉద్యోగులపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోందని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి.  మహమ్మారి కారణంగా ఇప్పటిదాకా 1,200 మందికిపైగా బ్యాంక్ ఉద్యోగులు మరణించారని ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎస్. నాగరాజన్ వెల్లడించారు. బ్యాంక్ ఉద్యోగులూ ఫ్రంట్ లైన్ వర్కర్లేనని, వైరస్ వారినీ కబళిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకులు కేసులు, మరణాలకు సంబంధించి సరైన సంఖ్య చెప్పట్లేదని, మరింత ఎక్కువ మంది చనిపోయి ఉంటారని ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సి.హెచ్. వెంకటాచలం అన్నారు. కాగా, బ్యాంకు, బీమా సంస్థల ఉద్యోగులకూ కరోనా ముప్పు ఎక్కువగా ఉందని, వారికీ వ్యాక్సిన్ వేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి దేవశీష్ పాండా రాష్ట్రాలకు లేఖ రాశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: