అమ‌రావ‌తి : రాష్ట్రంలో క‌రోన పాజిటివ్ కేసులు కొంచెం త‌గ్గుముఖం ప‌ట్టాయి. ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన బులిటెన్ ప్ర‌కారం గ‌డిచిన 24 గంట‌ల్లో 18,561 పాజిటివ్ కేసులు  మోద‌య్యాయి. అయితే ప్ర‌తి రోజు టెస్టులు సంఖ్య క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. రెండు మూడు రోజుల క్రితం లక్ష‌కుపైగా టెస్టులు నిర్వ‌హించ‌గా ఇప్పుడు 73వేల ప‌రీక్ష‌లు మాత్ర‌మే చేశారు.టెస్టులు సంఖ్య పెరిగితే పాజిటివ్ కేసుల సంఖ్య‌కూడా పెరుగుతుంది.మ‌రో వైపు మ‌ర‌ణాలు ఏమాత్రం త‌గ్గ‌డం లేదు ప్ర‌తి రోజు వంద‌కు పైగా మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి.గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోన బారినప‌డి 109 మంది మ‌ర‌ణించారు. అత్య‌ధికంగా ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో 16 మంది మ‌ర‌ణించ‌గా...అనంత‌పురం, చిత్తూరు,గుంటూరు జిల్లాలో ప‌ది మంది మ‌ర‌ణించారు.ఇటు తూర్పుగోదావ‌రి,విశాఖ ప‌ట్నం జిల్లాలో తొమ్మిది, కృష్ణా,నెల్లూరు,విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో ఎనిమిది మంది చొప్పున మ‌ర‌ణించారు.క‌ర్నూల్‌, శ్రీకాకుక‌ళంలో ఏడుగురు,ప్ర‌కాశం జిల్లాలో న‌లుగురు,క‌డ‌ప జిల్లాలో ముగ్గురు చొప్పున మ‌ర‌ణించారు.

ఇప్ప‌టివ‌రకు రాష్ట్రంలో 14,54,052 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా ప్ర‌స్తుతం 2,11,554 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.రాష్ట్రంలో రిక‌వ‌రీ కేసులు సంఖ్య కూడా ఎక్కువ‌గానే న‌మోద‌వుతుంది.ఇప్ప‌టివ‌ర‌కూ క‌రోన బారిన పడి కోలుకున్న వారు12,33,017 మంది ఉన్నారు.రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ప్ర‌భుత్వం అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటుంది.ప్రస్తుతం రాష్ట్రంలో పాక్షిక లాక్‌డౌన్ కొన‌సాగుతుంది.అయితే ఇది నేటితో ముగియ‌నుండ‌టంతో ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణయం తీసుకుంది.కరోన కేసులు తగ్గాలంటే నిబంధ‌న‌లు క‌ఠిన‌త‌రం చేయాల‌ని..ఈ లాక్‌డౌన్‌ని మ‌రో్ నాలుగువారాల పాటు అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.అయితే గ‌త ప‌దిరోజులుగా అమ‌లు చేస్తున్నపాక్షిక‌ లాక్‌డౌన్ అంత‌గా ప్ర‌భావం చూప‌డంలేదు. ఇప్ప‌టికే రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 20 శాతంపైగా న‌మోద‌వుతుంది.ఈ నేప‌థ్యంలో నిపుణులంతా పూర్తిస్థాయిలో లాక్‌డాన్ పెట్టాల‌ని సూచించారు.కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పాక్షిక లాక్‌డౌన్‌నే కోన‌సాగిస్తుంది.మ‌రోవైపు మ‌ర‌ణాల పెరుగుతుండ‌టంతో ఆందోళ‌న నెల‌కొంది.మ‌ర‌ణాల రేటు త‌గ్గించేందుకు అన్ని ఆసుప‌త్రుల్లో  రెమిడిసివిర్ ఇంజెక్ష‌న్లు,ఆక్సిజ‌న్ కొర‌త లేకుండా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంది

మరింత సమాచారం తెలుసుకోండి: