అరేబియా సముద్రంలో కొనసాగుతున్న అతి తీవ్ర ‘తౌటే’ తుఫాన్ గుజరాత్ దిశగా పయనమవుతోంది. ముంబైకి పశ్చిమ దిశగా 15 కి.మీ దూరంలో ఉన్న తుఫాన్.. గంటకు 20 కి.మీ వేగంతో ఈ తుఫాన్ కదులుతోంది. ముందుగా ఈ నెల 18న తీరాన్ని దాటుతుందని అంచనా వేయగా.. ఇవాళ రాత్రి 8.30 గంటల నుంచి 11.30 మధ్య గుజరాత్‌లోని పోరుబందర్-మహువా మధ్య తీరం దాటనుంది. ఇక.."తౌక్టే" ప్రభావంతో వీస్తున్న ప్రచండ గాలులకు ముంబయి తీరంలో ఓ వాణిజ్య నౌక రాయిని ఢీకొట్టింది. నౌక ప్రమాదానికి గురికావడంతో అందులోని 270 మంది సిబ్బంది గల్లంతయ్యారు. వీరి కోసం కోస్ట్‌గార్డ్ సిబ్బంది రంగంలోకి దిగారు. ఐఎన్ఎస్ కొచ్చి సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పెను గాలులు వీస్తుండటంతో సహాయక చర్యలు కొంత విఘాతం ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: