దేశంలో కరోనా వైరస్ మహ్మమారి మరింత తీవ్రరూపం దాల్చింది. రోజు రోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండగా, మరణాలు అంతేస్థాయిలో ఉన్నాయి. వైరస్ నియంత్రణలో భాగంగా విధించిన లాక్‌డౌన్ కొనసాగుతుండ‌గా, తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో కోర‌లు చాస్తోన్న వైర‌స్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటోంది. క‌రోనాపై చేస్తున్న యుద్ధంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందంజ‌లో నిలుస్తోంది.

కరోనా వైరస్‌ కట్టడిలోనూ, కోవిడ్‌ చికిత్సలకు వైద్య సదుపాయాలు కల్పించడంలోనూ దేశంలో మెరుగైన ఏకైక రాషట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచింది. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. కరోనా నియంత్రణలో తెలంగాణ, రాజస్థాన్‌, హరియాణ తొలి మూడు స్థానాల్లో నిలవగా.. మౌలిక వసతుల్లో తెలంగాణ, పంజాబ్‌, తమిళనాడు మొదటి మూడింటిలో నిలిచాయని వివరించాయి. హైదరాబాద్‌కు చెందిన టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌కు చెందిన స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ అండ్‌ గవర్నెన్స్‌, హైదరాబాద్‌కే చెందిన మరో సంస్థ ఇండిపెండెంట్‌ పబ్లిక్‌ పాలసీ రిసెర్చర్‌ సంయుక్తంగా అధ్యయనం నిర్వహించినట్టు తెలిపాయి. అధ్యయన పత్రం తాజాగా జర్నల్‌ ఆఫ్‌ సోషల్‌ అండ్‌ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌లో ప్రచురితమైంది. కొవిడ్‌ను కట్టడి చేయడంలో అవలంబించిన విధానాలను, ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఆసుపత్రుల్లో నెలకొల్పిన సౌకర్యాలను అధ్యయనంలో పరిగణనలోకి తీసుకున్నట్టు అవి తెలియజేశాయి. ఉత్తమం, పరవాలేదు, బాగోలేదు, అస్సలు బాగోలేదు.. అనే నాలుగు కేటగిరీల్లో ర్యాంకులిచ్చామని వివరించాయి. కరోనా కట్టడిలో ఓడిశా, ఝార్ఖండ్‌, అస్సాం, పశ్చిమ బెంగాల్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు రెడ్‌ జోన్‌లో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: