రోనా  కట్టడి చర్యలపై సీఎం వైఎస్‌ జగన్‌ తన క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. కోవిడ్‌తో తల్లిదండ్రులు చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని.. ఆ పిల్లలకు ఆర్థికసహాయంపై కార్యాచరణ రూపొందించాలని అధికారులకు తెలిపారు. కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.  కరోనా కారణంగా అనాథలైన పిల్లలకు రూ.10 లక్షల ఆర్థికసాయం చేయనున్నారు. ఈ మొత్తాన్ని పిల్లల పేరిట బ్యాంకులో ఎఫ్‌డీ చేయనున్నారు. ఈ ఆర్థికసాయంపై మరో రెండు రోజుల్లో ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం

మరింత సమాచారం తెలుసుకోండి: