నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహరంలో పలు ఆసక్తికరమైన మలుపులు, ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్‌కు ఎంపీ రఘురామకృష్ణ రాజు భార్య రమాదేవి ఫోన్ చేశారు. తన భర్తకు జైలులో ప్రాణహాని ఉందని, సుప్రీంకోర్టు తీర్పు సీఐడీకి వ్యతిరేకంగా రావడంతో.. కక్ష పెంచుకునే అవకాశం ఉందని తెలిపారు. తక్షణమే రఘురామను ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో వెంటనే స్పందించిన సీఎస్.. గంటలోనే ఎస్కార్ట్ ఏర్పాటు చేసి పంపుతామని చెప్పారు. అప్పటి వరకు జాప్యం చేసే ధోరణిలో కనిపించిన ప్రభుత్వ వర్గాలు రఘురామను హైదరాబాద్ తరలించారు. రఘురామ రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రికి రఘురామ చేరుకోనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: