రఘురామ కేసులో ఏబీఎన్, టీవీ5 చానెళ్లపై కేసులు పెట్టిన విషయం తెలిసిందే. ఎఫ్ఐఆర్‌లో రెండింటి పేర్లను సీఐడీ పోలీసులు చేర్చారు.  రఘురామకృష్ణరాజు వ్యవహారంలో తమపై ఏపీ ప్రభుత్వం రాజద్రోహం కేసును నమోదు చేయడంపై తెలుగు న్యూస్ చానళ్లు ఏబీఎన్, టీవీ5 సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఏపీ సీఐడీ పెట్టిన దేశద్రోహం కేసులను సవాల్‌ చేస్తూ ఆంధ్రజ్యోతి, టీవీ5 కూడా పిటిషన్ దాఖలు చేశాయి. రఘురాజు విద్వేష వ్యాఖ్యలను ప్రసారం చేశామంటూ తమపై సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారని పిటిషన్లలో పేర్కొన్నాయి. ఉద్దేశ పూర్వకంగానే తమను ఎఫ్ఐఆర్ లో చేర్చారని కోర్టు దృష్టికి తీసుకెళ్లాయి. తమ సంస్థపై, తమ ఉద్యోగులపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరాయి.  మీడియా సంస్థలపై రాజద్రోహం నేరం కింద కేసులు నమోదు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. పలు రాజకీయ, ప్రజా సంఘాల నేతలు ఈ చర్యను ఖండించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: