ముంబై లో ఓ వైపు కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంటే మరోవైపు వర్ష బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలతో ముంబై రోడ్లు జలమయం అవుతున్నాయి. రోడ్లపై భారీగా ట్రాఫిక్ నిలుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ముంబై వాసులు వణికిపోతున్నారు. భయటకు వస్తే ఎక్కడ ఏ ముప్పు పొంచి ఉందో అని భయపడిపోతున్నారు. ఇక ఇటీవల ఓ భవనం కూలడంతో భారీ ప్రాణ మరియు ఆస్తి నష్టం వాటిల్లింది. 

దాంతో శిథిలావస్థలో ఉన్న భవనాల నుండి ప్రజలను ముంబై మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక ఇప్పటికీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ముంబై ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది.  కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: