మందుబాబుల‌కు ఢిల్లీ స‌ర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మ‌ద్యాన్ని ఇంటివ‌ద్ద‌కే డెలివ‌రీ చేసే విధంగా ఎక్సైజ్ శాఖ నిబంధ‌ల‌ను ప్ర‌భుత్వం స‌వరించింది. దాంతో ఇక ఇంటి వ‌ద్ద‌కే చుక్క రానుంది. దీనికి సంభందించిన నోటిఫికేఫ‌న్ గురువారం రాగా శుక్ర‌వారం నుండి మొబైల్ యాప్ మ‌రియు వెబ్ సైట్ అందుబాటులోకి వ‌చ్చాయి. మ‌ద్యం ఆర్డర్ చేసేందుకు ఓ వెబ్ సైట్ తో పాటు మొబైల్ యాప్ ను ముందుగానే రూపొందించింది.

ఇక ప్ర‌భుత్వం ఆమోదించిన‌ప్ప‌టికీ ఇది అమ‌లు కావాలంటే మ‌రికొన్ని రోజులుప‌ట్టే అవ‌కాశం ఉంది. ఇదిలా ఉండగా మద్యం హోం డెలివ‌రీకి ప‌ర్మిష‌న్ రావ‌డంతో మందుబాబులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇక పై లైన్ లో గంట‌లు త‌ర‌బ‌డి నిల్చోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అనుకుంటున్నారు. అంతే కాకుండా ఇక పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా ఉండ‌వ‌ని మురిసిపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: