ఈట‌ల రాజేంద‌ర్ త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. గ‌న్ పార్క్ వ‌ద్ద అమ‌ర‌వీరుల‌కు నివాళ్లు అర్పించిన అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.ఎమ్మెల్యేగా ఓట‌మి లేకుండా త‌న‌ని ప్ర‌జ‌లు ఆశీర్వ‌దించార‌ని...తెలంగాణ రాష్ట్ర‌మే ప్ర‌జ‌ల‌కు శ్రీరామ‌ర‌క్ష అని కొట్లాడామ‌న్నారు.అనేక మంది వేరే పార్టీ నుంచి టీఆర్ఎస్‌లో చేరి రాజీనామా చేయ‌కుండా మంత్రులుగా నిస్సిగ్గు లేకుండా కొన‌సాగుతున్నార‌ని ఈట‌ల రాజేంద‌ర్ ఆరోపించారు.వంద‌ల కోట్ల రూపాయ‌లు సీఎం కేసీఆర్ ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని...త‌న‌ను ఓడ‌గొడ‌తార‌ని రాజీనామా చేయ‌వ‌ద్దు అని చాలా మంది చెప్పార‌ని గుర్తు చేశారు.హుజురాబాద్ ప్ర‌జ‌లు తెలంగాణ ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వ బావుట ఎగుర‌వేస్తార‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.తాను తెలంగాణ ప్ర‌జ‌ల కోస‌మే రాజీనామా చేస్తున్నాన‌ని...విదేశాల్లో ఉన్నవారు సైతం తాను గెల‌వాల‌ని కోరుకున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

రాష్ట్రంలో రైతుల ప‌రిస్థితి ఆగ‌మ్య‌గోచ‌రంగా ఉంద‌ని...ధాన్యం త‌డిచి మొల‌క‌లు వ‌చ్చిన ప‌ట్టించుకునే నాథుడేలేడ‌ని ఆరోపించారు.ఇవ‌న్నీ ప‌ట్టించుకోకుండా త‌న‌ని ఎలా చ‌క్ర‌బంధం చేయాలో అని పోలీసు అధికారులు వాడుకుంటున్నార‌ని ఈట‌ల రాజేంద‌ర్ ఆరోపించారు.త‌న‌కు నిర్భంధాలు కొత్త‌కాద‌ని...నియంత నుండి తెలంగాణ‌ను విముక్తి చేయ‌డ‌మే త‌న ఎజేండాన‌ని ఈట‌ల రాజేంద‌ర్ తెలిపారు.తెలంగాణ‌లో మేధావులంతా త‌న మ‌ద్ద‌తు తెల‌పాల‌ని...తాను ఎందుకు ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చిందో అర్థం చేసుకోవాల‌ని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: