క‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గుతున్న నేప‌థ్యంలో ఏపీ ప్ర‌భుత్వం క‌ర్ఫ్యూ ఆంక్ష‌లు స‌డ‌లిస్తుంది.దేవాల‌యాల్లో కూడా ద‌ర్శ‌న స‌మ‌యాల్లో మార్పులు చేస్తున్నారు. శ్రీశైలం భ్ర‌మ‌రాంబ మ‌ల్లిఖార్జున స్వామి ఆల‌యంలో ఉద‌యం 6 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1గంట వ‌ర‌కు భ‌క్తుల‌ను ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తున్న‌ట్లు ఆల‌య ఈవో కేఎస్ రామారావు తెలిపారు.ద‌ర్శ‌న స‌మ‌యంలో భ‌క్తులు కోవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని..ప్ర‌తి ఒక్క‌రు మాస్క్ ధ‌రించి రావాల‌ని ఆయ‌న కోరారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయంలో  జరిగే అన్ని ఆర్జిత సేవలు అర్చక స్వాములు ఏకాంతంగా నిర్వహిస్తార‌ని తెలిపారు.ఆలయ పరిధిలోని దుకాణాలు మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు అనుమతిస్తున్న‌ట్లు ఈవో తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: