దేశంలో క‌రోనా ఫ‌స్ట్ వేవ్ పెద్ద‌గా ప్ర‌భావం చూప‌క‌పోవ‌డంతో కేంద్రం తీసుకుంది. దేశంలో వ్యాక్సినేష‌న్ ను త్వ‌ర‌గా పూర్తి చేసేందుకు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. దాంతో సెకండ్ వేవ్ వ‌చ్చి దేశానికి గుణ‌పాఠం నేర్పించింది. ఎంతో మంది ప్ర‌జ‌ల‌ను పొట్టన పెట్టుకుంది. వేల మంది చిన్న‌పిల్ల‌ల‌ను అనాథ‌ల‌ను చేసింది. ఈ నేప‌థ్యంలో కేంద్రం మేలుకుని త్వ‌ర‌గా వ్యాక్సినేష‌న్ ను పూర్తి చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.

అంతే కాకుండా వ్యాక్సినేష‌న్ బాధ్య‌త నెత్తిమీద వేసుకుంది. ఇక  ఇప్ప‌టి వ‌ర‌కూ మొత్తం 25.87 కోట్లకు పైగా వ్యాక్సిన్లను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 1.12 కోట్లకు పైగా వ్యాక్సిన్లు రాష్ట్రాల వద్ద అందుబాటులో ఉన్న‌ట్లు తెలిపింది. అంతే కాకుండా రాబోయే మూడురోజుల్లో 10లక్షలకు పైగా వ్యాక్సిన్లను రాష్ట్రాలకు పంపిణీ చేస్తామ‌ని స్ప‌ష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: