నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏడాదిన్నర కాలంగా సొంత సొంతపార్టీ పైనే విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా వైసీపీ తరపున ఎంపీగా ఎన్నికైన రఘురామ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ఫిర్యాదు చేసి రఘురామ కు షాక్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా వైసీపీ రఘురామకు మరో షాక్ ఇచ్చింది. వైసీపీ అధికారిక వెబ్ సైట్ లో ఉన్న ఆ పార్టీ ఎంపీల జాబితా నుండి రఘురామ పేరును తొలగించింది. వైసీపీ నుండి  రాజ్యసభ, లోక్ సభకు ఎన్నికైన 28మంది సభ్యుల పేర్లను గతంలో వెబ్ సైట్ లో  పొందుపరిచింది.

అంతేకాకుండా ఇటీవల తిరుపతి నుండి గెలిచిన డాక్టర్ గురుమూర్తి పేరును కూడా ఎంపీల జాబితాలో చేర్చారు. కానీ రఘు రామ పేరు మాత్రం సవరించిన జాబితాలో చేర్చలేదు. ఎంపీల జాబితాలో పేరు లేకపోవడంపై రఘురామ స్పందించారు. "ఈరోజు పార్టీ అధ్యక్షుడు నన్ను బహిష్కరించారా.?" అని ప్రశ్నించారు. తన పార్లమెంట్  తనపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేయడంతో తనకు ఫోన్ లు వస్తున్నాయని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: