బంగారం కొనుక్కునే వారికి గుడ్ న్యూస్. శనివారం నాడు పెరిగిన బంగారం ధరలు ఆదివారం నాడు స్వల్పంగా తగ్గాయి. అయితే బంగారం ధరలు తగ్గితే వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. మార్కెట్ రేట్ల ప్రకారం ఈరోజు పది గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర రూ. 45,750లుగా ఉంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు 350 రూపాయల రేట్ తగ్గింది. ఇక అలాగే 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఈరోజు 49,900 లుగా ఉంది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు 400 రూపాయల మేర రేట్  తగ్గింది. ఇక దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఈమేరకు ఉన్నాయి.

 

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,050 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 52,420గా ఉంది. 

ముంబైలో  22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,740 ఉండగా.. 24 క్యారెట్స్ ధర 48,740 లు ఉంది. 

చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.46,300 ఉండగా  24 క్యారెట్ల ధర రూ.50,500గా ఉంది. 

బెంగుళూరులో 22 క్యారెట్ల ధర రూ. 45,900గా ఉండగా 24 క్యారెట్ల ధర రూ. 50,070గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: