కొద్ది రోజుల క్రితం తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాను పార్టీ మారే ఉద్దేశం లేదని అప్పుడు ఆయన క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ అలాంటి ఉద్దేశం ఏదైనా ఉందంటే అందరినీ సంప్రదించి ప్రకటిస్తానని కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయన సొంత నియోజకవర్గమైన జగిత్యాలలో స్థానిక కార్యకర్తలతో సమావేశం కానుండడం ఆసక్తికరంగా మారింది. 


పార్టీ మార్పు పై వస్తున్న ప్రచారం గురించి ఈ కార్యకర్తల సమావేశంలో క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు కార్యకర్తలు ఎల్ రమణ కు ఫోన్ చేయగా జగిత్యాలలో మాట్లాడుకుందాం అని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజా పర్యటన మీద కేడర్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఆయన ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారో అనే అంశం మీద అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: