దేశంలో పెట్రో ప్రోడక్ట్ లకు సంబందించిన అన్ని రేట్లు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే గత కొద్ది రోజులుగా ప్రతి నిత్యం పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతూ సామాన్యులకు గుదిబండలా మారుతున్నాయి. ఇప్పటికే కరోనా దెబ్బకు లాక్ డౌన్ విధించడంతో పనులు, ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు పెట్రోల్‌ ధరలు వంద మార్క్ దాటి మరింత ముందుకు పరుగులు పెడుతున్నాయి. 


ఈరోజు పెట్రోల్‌, డీజిల్ పై 25 పైసలు చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే పెరిగిన ధరలు రికార్డు స్థాయికి చేరుకోగా తాజాగా మళ్ళీ పెరిగిన ధరలు షాకిస్తున్నాయి. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్ ధర రూ.96.12కి చేరగా లీటర్ డీజిల్‌ ధర రూ.86.98కి చేరింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: