అనూహ్య రీతిలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని నుంచి బయటకు వచ్చిన ఈటెల రాజేంద్ర తాజాగా తన ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామ చేసిన గంటల వ్యవధిలోనే రాజీనామా ఆమోదం కూడా జరిగిపోయింది. అయితే రాజీనామా ఆమోదం జరిగిన వెంటనే ఆయన ఢిల్లీ వెళ్లి అక్కడ బీజేపీ నేతలతో మంతనాలు జరుపుతారని భావించారు. కానీ అనూహ్యంగా ఆయన నిన్న ఢిల్లీ వెళ్లలేదు. అందుతున్న సమాచారం మేరకు రేపు ఉదయం బీజేపీ నేతలతో కలిసి ఢిల్లీకి ఆయన వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.. 

బిజెపి ముఖ్య నేతలు అలాగే జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఆయన కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఈటెలతో పాటు బిజెపిలో ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ, రమేష్ రాథోడ్, అశ్వద్ధామ రెడ్డి తదితరులు బీజేపీలో చేరే అవకాశం కనిపిస్తోంది. వీరితో పాటు బిజెపిలోకి ఓయూ జేఏసీ నేతలు మందల భాస్కర్, దత్తాత్రేయ, వెంకట్, సంతోష్ ముదిరాజ్, మేడి రమణ కూడా చేరే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇక బిజెపిలో చేరిన అనంతరం ఒక రోజు పాటు అక్కడే బస చేయనున్న ఈ నేతలు తరువాతి రోజు హైదరాబాద్కు చేరుకునే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: