దేశవ్యాప్తంగా టెన్షన్ పెట్టిన కరోనా మహమ్మారి రెండోదశ ఇప్పుడు కాస్త తగ్గింది. అయితే ఇప్పటికే చాలా రాష్ట్రాలు కర్ఫ్యూ ఆంక్షలను సడలిస్తూ వస్తున్నాయి. కానీ తాజాగా తమ రాష్ట్రంలో అమలు చేస్తున్న కర్ఫ్యూ పొడిగిస్తున్నట్లు గోవా ప్రభుత్వం ప్రకటించింది.  కొన్ని సడలింపు లతో ఈ నెల 21వ తేదీ వరకు ఈ ఆంక్షల పొడిగిస్తున్నట్లు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ కుమార్ సావంత్ పేర్కొన్నారు. 


తాజా సడలింపులు ప్రకారం పంచాయతీలు, మున్సిపల్ మార్కెట్లతో సహా షాపులన్నీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తెరుచుకోవచ్చని సీఎం ప్రమోద్ పేర్కొన్నారు. ఒక వేళ వివాహ కార్యక్రమాలు లాంటివి ఏవైనా నిర్వహించాల్సి వస్తే కేవలం 50 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: