కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో మళ్ళీ టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. బ్రహ్మంగారి మఠంలో  పీఠాధిపతుల బృందం పర్యటన నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. ఈ చర్చలకు అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. అందుకే ఆలయ పరిసర ప్రాంతాల్లో గ్రామస్థులకు కూడా ఎలాంటి అనుమతి లేదని పోలీసులు హెచ్చరికస్తున్నారు. ఇక బ్రహ్మంగారి మఠం తరువాతి పీఠాధిపతి ఎవరనే దానిపై ఉత్కంఠ వీడటం లేదు. ఒకే కుటుంబంలో ఏర్పడిన వర్గాలతో పీఠాధిపతి ఎంపిక ఇప్పుడు సమస్యగా మారింది. 


పీఠం ప్రతిష్టను కాపాడం కోసం ఏకంగా 12 మంది పీఠాధిపతులు రంగంలొకి దిగడంతో కొత్త సమస్యలు మొదలయినట్టు అయింది. 11వ పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి పరమపదించాక ఎవరు తదుపరి పీఠాధిపతి అనే అంశంలో పీఠాధిపతుల రాకను రెండో భార్య మహాలక్ష్మమ్మ  వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే పీఠాధిపతుల బృందంపై డిజిపికి సైతం మహాలక్ష్మమ్మ ఫిర్యాదు చేశారు. అయితే వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి పెద్ద కుమారుడు వెంకటాద్రికి మద్దతుగా ఆందోళన చేసేందుకు కందిమళ్లాయపల్లె గ్రామస్థులు కూడా సిద్ధమైన నేపధ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: