క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో దేశ వ్యాప్తంగా వివిధ పండుగ‌ల‌ను జ‌రుపుకునేందుకు అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు అనుమ‌తి నిరాక‌రించాయి.అయితే కుంభ‌మేళాకి మాత్రం ల‌క్ష‌ల సంఖ్య‌లో భ‌క్తుల‌ను అనుమ‌తి ఇవ్వ‌డం దుమారం రేగింది. సెంక‌డ్ వేవ్‌కి కార‌ణం కుంభ‌మేళానేనంటూ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అయితే కుంభ‌మేళా సంద‌ర్భంగా ఉత్త‌రాఖండ్ ఆరోగ్య‌శాఖ అక్క‌డికి వ‌చ్చిన వారు క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని నిబంధ‌న‌లు పెట్టింది. ప‌రీక్ష‌ల కోసం ఉత్త‌రాఖండ్ ఆరోగ్య‌శాఖ 22 ప్ర‌వేట్ ల్యాబ్‌ల‌కు అనుమ‌తి ఇచ్చింది. అయితే ఈ 22 ల్యాబ్‌లో మిలియ‌న్ల‌లో టెస్టులు జ‌రిగిన‌ట్లు నివేదిక‌ల్లో బ‌య‌ట‌ప‌డ్డాయి.  జ‌న‌వ‌రి 14 నుంచి ఏప్రిల్ 27 వ‌ర‌కు గంగాన‌దిలో 90 ల‌క్ష‌ల మందికిపైగా యాత్రికులు ప‌విత్ర‌స్థానాలు చేశారని ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వం తెలిపింది.అయితే వీరంద‌రు క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్న త‌రువాత‌నే స్నానాల‌కు అనుమ‌తి ఇచ్చారు.కానీ ఇక్క‌డే అస‌లు క‌థ బ‌య‌ట‌ప‌డింది.యాత్రికుల‌కు నిర్వ‌హించిన ల‌క్ష‌లాది క‌రోనా ప‌రీక్ష‌లు న‌కిలీ అని తెలడంతో ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వం దీనిపై విచార‌ణ‌కు అదేశించింది.కుంభ‌మేళాకి వ‌చ్చిన భ‌క్తుల ఆదార్ కార్డు నెంబ‌ర్లు,ఫోన్ నెంబ‌ర్లు తీసుకుని క‌రోనా లేన‌ట్లు స‌ర్టిఫికేట్లు ఇచ్చిన‌ట్లు ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: