తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డి నియ‌మితుల‌వ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈమేర‌కు రేవంత్‌రెడ్డి పేరును తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి మ‌ణికం ఠాగూర్ పార్టీ అధిష్టానానికి సిఫార్సు చేసిన‌ట్లు తెలుస్తోంది. అధిష్టానం ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగానే ఠాగూర్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు పార్టీవ‌ర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరిన త‌ర్వాత రాహుల్‌గాంధీ, ప్రియాంక‌వాద్రాల‌కు అత్యంత స‌న్నిహితుడిగా మారిన‌ రేవంత్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ ఎస్ పార్టీతోపాటు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై త‌న వాగ్ధాటితో విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. కాంగ్రెస్‌లో అంద‌రూ సీనియ‌ర్ నేత‌లే కావ‌డంతోపాటు భ‌విష్య‌త్తును దృష్టిలో ఉంచుకొని రాహుల్‌గాంధీ రేవంత్‌రెడ్డివైపే మొగ్గుచూపే అవ‌కాశం క‌న‌ప‌డుతోంద‌ని స‌మాచారం. టీఆర్ ఎస్‌, బీజేపీల‌ను ధీటుగా ఎదుర్కోవాలంటే ఫైర్‌బ్రాండ్‌గా పేరుండ‌టంతోపాటు స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌క‌త్వం అందించ‌గ‌ల‌గ‌డం రేవంత్‌కు సాధ్య‌మ‌వుతుంద‌ని ఢిల్లీ పెద్ద‌ల ఆలోచ‌న‌గా రాష్ట్ర పార్టీవ‌ర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: