క‌డ‌ప‌లోని రిమ్స్ ఆస్ప‌త్రి ఆడిటోరియంలో దొంగ‌త‌నం జ‌రిగింది. కోటిరూపాయ‌ల విలువ‌చేసే ఏసీలు, కంప్యూట‌ర్లు, ఇత‌ర ఎలక్ట్రానిక్ వస్తువులు మాయ‌మ‌య్యాయి. గుర్తుతెలియ‌ని దుండ‌గులు వీటిని ఎత్తుకెళ్లిన‌ట్లుగా కేసు న‌మోదైంది. కొవిడ్ కార‌ణంగా సంవ‌త్స‌రం నుంచి ఆడిటోరియంను తెర‌వ‌లేదు. తాజాగా ఆడిటోరియం తెరిచి చూడ‌గా వ‌స్తువుల‌న్నీ మాయ‌మైన‌ట్లు అధికారులు గుర్తించారు. సిబ్బందిపైనే అనుమానం వ్య‌క్తం చేసి పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. ఆడిటోరియానికి చేరుకున్న పోలీసులు అన్నీ ప‌రిశీలించిన త‌ర్వాత కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు. శాశ్వ‌త ఉద్యోగులెవ‌రు?  తాత్కాలిక ప్రాతిప‌దిక‌పై ప‌నిచేసే ఉద్యోగులెవ‌రు?  మొత్తం ఎంత‌మంది సిబ్బంది విధులు నిర్వ‌హిస్తున్నారు? త‌దిత‌ర వివ‌రాల‌ను పోలీసులు అడిగి తీసుకున్నారు. అనుమానిత సిబ్బంది ఎవ‌రెవ‌రు? అనేదానిపై ప్ర‌త్యేకంగా ఒక జాబితా త‌యారుచేసిన ఆడిటోరియం అధికారులు పోలీసుల‌ను క‌లిసి వివ‌రాలందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: