తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడి ఎంపిక‌పై సీనియ‌ర్లు అసంతృప్తిగా ఉన్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా మ‌ల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి పేరు దాదాపుగా ఖ‌రారైంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది.అయితే కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ వి.హనుమంత‌రావు మాత్రం రేవంత్‌రెడ్డి ఎంపిక‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాడు.తెలంగాణ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగుర్‌పై కూడా తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు చేశారు.తెలంగాణ పీసీసీ కోసం ఏఐసీసీ నుంచి ప‌రిశీల‌కుడిని ఎందుకు పంపిచ‌లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నిచారు. మాణ‌క్కం ఠాగుర్ ఒక్క‌రే అభిప్రాయ సేక‌ర‌ణ చేస్తే ఎలా స‌రిపోతుంద‌ని ప్ర‌శ్నిచారు.ఇంఛార్జ్‌కి క‌నీసం ఫోన్ చేస్తే స్ప‌దించ‌డంలేద‌ని వీహెచ్ ఆరోప‌ణ‌లు చేశారు. పీసీస అధ్య‌క్షుడిగా ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేసిన ఆయ‌న అదృష్టం బాగుండి ఇంకా కొన‌సాగుతున్నార‌ని ఎద్దేవా చేశారు.ఎన్నో ఏళ్ల నుంచి పార్టీలో ఉన్న‌వారికి కాకుండా బ‌య‌ట నుంచి వ‌చ్చిన వారికి పీసీపీ ఇస్తామంటే త‌మ‌ ఆత్మ‌గౌర‌వం దెబ్బ‌తింటుంద‌న్నారు. పార్టీలో మొద‌టి నుంచి లాయ‌ల్టీగా ఉన్న వారికి పీసీసీ ఇవ్వాల‌ని ఇదే విష‌యాన్ని సోనియాగాంధీకి లేఖ రాశాన‌ని వీహెచ్ తెలిపారు.కాంగ్రెస్‌లో త‌న‌ని పొగ‌బెట్టి పంపించే ప్ర‌య‌త్నాలు కొంత‌మంది చేస్తున్నార‌ని...ప‌ద‌వుల కోసం రాజ‌కీయాల్లోకి రాలేద‌ని ఆయ‌న తెలిపారు

మరింత సమాచారం తెలుసుకోండి: