తెలుగు రాష్ట్రాల మ‌ధ్య రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు ఇంకా కొన‌సాగుతునూ ఉన్నాయి. తెలంగాణ‌లోకి ఏపీ వాహ‌నాల‌ను ఎట్టిప‌రిస్థితుల్లో అనుమ‌తించ‌డంలేదు.క‌రోనా మొద‌టి ద‌శ నుంచి ఇరు రాష్ట్రాల మ‌ధ్య ప్ర‌యాణం చేయ‌డానికి ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మొద‌టి ద‌శలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ఇరు రాష్ట్రాల మ‌ధ్య రాక‌పోక‌లు కొన‌సాగాయి.అయితే తాజ‌గా రెండ‌వ ద‌శ‌లో కేసులు పెరగ‌డంతో మ‌ళ్లీ స‌రిహ‌ద్దుల‌ను మూసివేశారు.తెలంగాణ నుంచి ఏపీకి అనుమ‌తి ఉన్నా ఏపీ నుంచి మాత్రం తెలంగాణ‌లోకి అనుమ‌తి ల‌భించ‌డంలేదు. గ‌త నెల రోజుల పాటు తెలంగాణ‌లో లాక్‌డౌన్ ఆంక్ష‌లు కొన‌సాగాయి.తాజాగా ఆంక్ష‌ల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం స‌డ‌లించింది. ఉద‌యం ఆరుగంట‌ల నుంచి సాయంత్రం ఆరుగంట‌ల వ‌ర‌కు అనుమ‌తి ఇవ్వ‌డంతో స‌రిహ‌ద్దుల్లో కూడా రాక‌పోక‌ల‌కు అనుమ‌తి ఉంటుంద‌ని వాహ‌న‌దారులు భావిస్తున్నారు.ఈ పాస్ అవ‌స‌రం లేకుండానే తెలంగాణ‌లోకి వెళ్లేంద‌కు చెక్‌పోస్టుల వ‌ద్దకు పెద్ద ఎత్తున వాహ‌న‌దారులు చేరుకోవ‌డంతో పోలీసులు అనుమ‌తివ్వ‌డంలేదు. ఆంక్ష‌లు స‌డ‌లింపు ఇచ్చిన తెలంగాణలోకి ప్ర‌వేశించాలంటే ఈ పాస్ త‌ప్ప‌నిస‌రంటూ పోలీసులు వాహ‌న‌దారుల‌ను వెన‌క్కి పంపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ పాస్ ఉన్న‌వారిని మాత్ర‌మే తెలంగాణ‌లోకి అనుమ‌తిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: