సింగరేణి కార్మికులను ఫ్రంట్లైన్ వారియర్స్ గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గుర్తించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఆదేశాలతో సింగరేణిసంస్థ చైర్మన్ మరియు ఎం డి శ్రీ ఎన్ .శ్రీధర్,సింగరేణి డైరెక్టర్ల పర్యవేక్షణలో ఈరోజు సింగరేణి వ్యాప్తంగా మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమయింది. కార్మికులకు అందుబాటులో ఉండేందుకు, భౌతిక దూరం పాటించేందుకు వీలుగా మొత్తం 12 ఏరియాల్లో 39 చోట్ల పెద్ద ఎత్తున క్యాంపులను ఏర్పాటు చేశారు.


 ఈరోజు మొత్తం 15వేల మంది కార్మికులకు వ్యాక్సినేషన్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఆదివారం వరకూ ప్రతీ రోజు వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగించనున్నారు. 10 రోజుల్లో మిగిలిన 29 వేల మందికి వ్యాక్సినేషన్  పూర్తి చేయాలని  సింగరేణి చైర్మన్ ఆదేశించారు. పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ చేపట్టడం పట్ల కార్మికులు కార్మిక సంఘాల హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: