ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 6,770 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. 58 మంది మృత్యువాత ప‌డ్డారు. ఈ మ‌హ‌మ్మారి నుంచి 12,492 మంది పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసుల సంఖ్య‌లో క‌లుపుకొని ఏపీలో మొత్తం కేసులు 18,09,844కి చేరుకున్నాయి. వీటిలో యాక్టివ్ కేసులు 85,637గా ఉండ‌గా, ఇప్ప‌టివ‌ర‌కు 11,940 మంది మ‌ర‌ణించారు. చిత్తూరు జిల్లాలో 12 మంది మృతిచెంద‌గా, తూర్పుగోదావ‌రి, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో ఏడుగురు, శ్రీ‌కాకుళంలో ఆరుగురు, విశాఖ‌ప‌ట్నం, అనంత‌పురం జిల్లాల్లో న‌లుగురు, కృష్ణా, ప్ర‌కాశం, క‌డ‌ప‌, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో ముగ్గురు చొప్పున‌, నెల్లూరు, క‌ర్నూలు, గుంటూరు జిల్లాల్లో ఇద్ద‌రు చొప్పున ఈ మ‌హ‌మ్మారికి బ‌ల‌య్యారు. కొవిడ్ వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఉచిత వ్యాక్సిన్ వేయిస్తామ‌ని ప్ర‌క‌టించింది. తాజాగా అంత‌ర్జాతీయ నిపుణులు కూడా రెండు టీకాల మ‌ధ్య వ్య‌వ‌ధిని కుదించాల‌ని చెపుతుండ‌టంతో మ‌రిన్ని టీకాల‌ను రాష్ట్రానికి ర‌ప్పించే ప‌నిలో ప్ర‌భుత్వం ఉంది. ఈనెల 21వ తేదీ నుంచి 18 సంవ‌త్స‌రాల వ‌య‌సు నిండిన‌వారికి కూడా టీకాలు వేయించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించ‌డంతో అందుకు స‌రిప‌డా టీకాల‌ను స‌ర‌ఫ‌రా చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం భార‌త్ బ‌యోటెక్‌, సీరం ఇన్‌స్టిట్యూట్స్ ను కోరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: