ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు  పీఆర్సీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పరిస్తితి ఉంద‌న్నారు ఏపీ జేఏసీ  ఛైర్మ‌న్ బొప్ప‌రాజు వెంక‌టేశ్వ‌ర్లు.ప‌ద‌కొండ‌వ పీఆర్సీ బెనిఫిట్స్‌ని వెంట‌నే విడుద‌ల చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.సీపీఎస్ ర‌ద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ త‌దిత‌ర అంశాల‌పై వీలైనంత త్వ‌రలో ప్ర‌భుత్వం స్పందించాల‌న్నారు. సీఎం జ‌గ‌న్ ఉద్యోగుల విష‌యంలో సానుకూలంగా నిర్ణ‌యాలు ప్ర‌క‌టిస్తార‌నే న‌మ్మ‌కం, విశ్వాసం త‌మ‌కు ఉంద‌ని ఆయ‌న తెలిపారు.సీపీఎస్ ర‌ద్దు కోసం ఉద్యోగులు వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నామ‌న్నారు.అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఇచ్చిన హామీకి క‌ట్టుబ‌డి 27 శాతం ఐఆర్ ఇచ్చార‌ని...70వేల మంది ఆర్టీసీ కార్మికుల‌ను ప్ర‌భుత్వ ఉద్యోగులుగా గుర్తించార‌ని తెలిపారు.పారిశుద్ధ్య కార్మికులాంటి చిరు ఉద్యోగుల జీతాల‌ను సైతం సీఎం పెంచార‌ని తెలిపారు. ఇలాంటి అనేక హామీలు నెరవేర్చిన సీఎం జగన్ పై మాకు నమ్మకం ఉందని..త్వ‌రలోనే త‌మ హామీల‌ను సీఎం నేర‌వేర్చాల‌ని ఆయ‌న కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: