గత కొద్ది రోజులుగా ఏపీలో చర్చనీయాంశంగా మారిన రఘురామకృష్ణంరాజు మీద వైఎస్ఆర్ సీపీకి చెందిన మరో ఎంపీ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు మీద తాజాగా చిత్తూరు ఎంపీ రెడ్డప్ప తీవ్ర ఆరోపణలు చేశారు. రేపో మాపో ఆయన పార్టీ నుంచి సస్పెండ్ కావడం అని పేర్కొన్న ఆయన ఆ సస్పెండ్ కావడం కూడా ఆయన చేసుకున్న స్వయంకృతాపరాధమే అని అన్నారు. రఘురామకృష్ణంరాజును అడ్డుపెట్టుకుని టిడిపి జగన్మోహన్రెడ్డి మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. రఘురామకృష్ణంరాజు జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయమని కోరడం వెనుక కూడా టిడిపి హస్తం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. 


పవర్ ప్లాంట్ల నిర్మాణం పేరుతో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రఘురామకృష్ణంరాజు వేల కోట్ల రూపాయలు బ్యాంకులో రుణాలు తీసుకుని మోసాలకు పాల్పడ్డాడని అన్నారు. తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ నుంచి టిక్కెట్ దొరకక ఇబ్బందులు పడుతున్న తరుణంలో దయతలిచి జగన్ టికెట్ ఇస్తే ఇప్పుడు ఆయన మీద ఎదురు దాడికి దిగడం బాధాకరమని రెడ్డి చెప్పుకొచ్చారు. బీజేపీ టీడీపీలు కుమక్కయ్యి జగన్ మోహన్ రెడ్డి మీద ఇలాంటి చర్యలకు పాల్పడడం దారుణమని ఆయన విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: