ఏపీలో బాల కార్మిక వ్య‌వ‌స్థ నిర్మూలించడానికి ప్ర‌భుత్వం పోలీస్ శాఖ చేప‌డుతున్న కృషి అభినంద‌నీయ‌మ‌ని నోబెల్ బ‌హుమ‌తి గ్ర‌హీత కైలాస్ స‌త్యార్థి ప్ర‌శంసించారు.ఇదే విష‌యాన్ని వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు. రాష్ట్రంలో పోలీస్ శాఖ 34,037 మంది బాల‌కార్మికుల‌కు విముక్తి క‌ల్పించింద‌ని వెల్ల‌డించారు. క‌రోనాతో త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయిన పిల్ల‌ల పేరిట 10 ల‌క్ష‌ల రూపాయ‌లు డిపాజిట్ చేయ‌డం ప‌ట్ట‌ల కూడా కైలాస్ స‌త్యార్ధి హ‌ర్షం వ్య‌క్తం చేసినట్లు విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. రాష్ట్రం వ్యాప్తంగా ఆప‌రేష‌న్ ముస్కాన్ పేరుతో పోలీసులు ప్ర‌తి జిల్లాలో బాల‌కార్మికుల‌ను వెతికి ప‌ట్టుకున్నారు. అభంశుభం తెలియని చిన్న పిల్ల‌ల‌తో వెట్టిచాకిరి చేపించుకునే వారి దగ్గ‌ర నుంచి వారికి విముక్తి క‌ల్పించి చైల్డ్ లైన్‌కి అప్ప‌గించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: