తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. అయితే తాజాగా ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ నగరంలోనూ భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడం తో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. తెల్లవారుజాము ఉదయం 3 గంటల నుండి 6 గంటల వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది.

నైరుతి రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం తో గత రెండు రోజులుగా వాతావరణం చల్లగానే ఉండి వర్షాలు కురుస్తున్నాయి. మన రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఈ ఏడాది వర్షాలు గట్టిగానే కురుస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలోని ముంబై నగరంలో అయితే భారీ వర్షాల కారణంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: