క‌రోనా కార‌ణంగా మృతిచెందిన‌వారి కుటుంబాల‌ను ఆదుకోవాల్సి వ‌స్తుంద‌నే దుర్మార్గ‌పు ఆలోచ‌న‌తోనే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి వాస్త‌వాల‌ను తొక్కిపెడుతున్నార‌ని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. రాష్ట్రంలో సాధార‌ణ మ‌ర‌ణాల‌కంటే 1.30 లక్ష‌ల మంది అధికంగా మే నెల‌లో మృతిచెందిన‌ట్లు సివిల్ రిజిస్ట్రేష‌న్ సిస్టం గ‌ణాంకాలు చెబుతున్నాయ‌ని, దీన్నిబ‌ట్టి కొవిడ్ ఉధృతిని అంచ‌నా వేయ‌వ‌చ్చంది. ఈమేర‌కు ఆ పార్టీ అధికార ప్ర‌తినిధి కొమ్మారెడ్డి ప‌ట్టాభిరామ్ మీడియాతో మాట్లాడుతూ ప‌లు విష‌యాల‌ను వెల్ల‌డించారు. త‌న జేబులో సొమ్మేదో ఇస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి బాధ‌ప‌డిపోతున్నార‌ని, జ‌గ‌న్‌రెడ్డి మోసం కార‌ణంగా, ప్ర‌భుత్వ దొంగ‌లెక్క‌ల ప్ర‌కారం న‌ష్ట‌పోయిన‌వారికి తెలుగుదేశం పార్టీ అండ‌గా ఉంటుంద‌న్నారు. క‌రోనావ‌ల్ల ఎవ‌రైతే న‌ష్ట‌పోయారో వారు 81442 26661 నెంబ‌రుకు మిస్డ్ కాల్ ఇస్తే ప్ర‌భుత్వంపై ఒత్తిడి తెచ్చి వారి కుటుంబాల‌కు న్యాయం జ‌రిగేలా చూస్తామ‌ని హామీ ఇచ్చారు. ఏపీలో క‌రోనా మ‌ర‌ణాలు 400 శాతం ఎక్కువ‌గా ఉన్నాయ‌న్నారు. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్ర‌వ్యాప్తంగా 26.23 ల‌క్ష‌ల మందికే రెండు డోసుల టీకా ఇచ్చార‌ని, అది కేవ‌లం 4.8 శాతంతో స‌మాన‌మ‌ని, ఇలా టీకాలు వేయాలంటే ప్ర‌భుత్వానికి 1194 రోజులు ప‌డుతుంద‌ని తెలిపారు. రిక‌వ‌రీ రేటు కూడా ఏపీలో 94 శాతంగానే ఉంద‌ని, కొవిడ్ నియ‌త్ర‌ణ‌లో ప్ర‌భుత్వం అట్ట‌డ‌గున ఉంద‌ని ప‌ట్టాభి ఆరోపించారు. ప్ర‌జ‌లు వాస్త‌వాలు గ‌మ‌నించి ప్ర‌భుత్వం చెబుతున్న త‌ప్పుడు లెక్క‌ల‌పై నిల‌దీయాల‌ని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: