అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్లకు కేసీఆర్ కియా కార్లు గిఫ్ట్ గా ఇవ్వ‌డంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  సెటైర్లు వేశారు. కియా కార్లు లేకపోతే అదనపు కలెక్టర్లు పని చెయ్యరా..అని ప్ర‌శ్నించారు. కియా కార్ల డీలర్ గా కేసీఆర్ పని చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. మొన్నటి దాకా కేసీఆర్ ఇన్నోవా డీలర్, ఇప్పుడు కియా డీలర్..అంటూ వ్యంగ్యాస్త్రాలు కురింపించారుడు. కేసీఆర్ కలెక్టర్ల స్థాయిని తగ్గించి అడిషనల్ కలెక్టర్ల స్థాయి పెంచారంటూ వ్యాఖ్యానించారు. కార్లను కొనేందుకు అది ఎవడబ్బ సొమ్మంటూ అగ్రహం వ్య‌క్తం చేశారు. కియా కార్ల తో పాలన పరుగులు పెడుతుందా..? అంటూ ప్ర‌శ్నించాడు. కలెక్టర్లకు కార్లు ఇస్తే చాలా.. నాలుగో తరగతి ఉద్యోగుల కనీస వసతులు ఆలోచించవా...? అంటూ వ్యాఖ్యానించారు. 

అంతే కాకుండా మాజీ మంత్రి ఈట‌ల రాజేందర్ టీఆర్ఎస్ ను వీడి బీజేపీతో జ‌త‌క‌ట్ట‌డం పై కూడా జీవ‌న్ రెడ్డి విమ‌ర్ష‌ల వ‌ర్షం కురింపించారు.  ఈటల రాజేందర్ బీజేపీలోకి వెళ్లి ఈటెల తప్పు చేశర‌ని వ్యాఖ్యానించారు. బీజేపీలోకి వెల్లడం కంటే టీఆర్ఎస్ లోనే ఉంటే బాగుండని అన్నారు. బీజేపీ టీఆర్ఎస్ కు (బి టీమ్) బీజేపీ అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీఆర్ఎస్ చెప్పు చేతల్లో బీజేపీ ఉందంటూ విమ‌ర్శ‌లు కురింపించారు. బీజేపీ లోకి వెళ్లి ఈట‌ల  ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. ఈ మాత్రం దానికి కేసీఆర్ ను ఎందుకు గెలికావ్..అంటూ ఈట‌ల‌ను ప్ర‌శ్నించారు. కేసీఆర్ తోనే సక్కగా ఉంటే సరిపోయేది కదా.. అంటూ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: