ఈటీవీలో ప్ర‌సార‌మ‌వుతోన్న హాస్య కార్య‌క్ర‌మం జ‌బ‌ర్ద‌స్త్‌లో ఒక టీమ్‌లీడ‌డైర హైప‌ర్ ఆదిపై పోలీసుల‌కు ఫిర్యాదు అందింది. గౌర‌మ్మ‌, బ‌తుక‌మ్మ‌, తెలంగాణ భాష‌ను కించ‌ప‌రిచేలా ఆయ‌న ఒక కార్య‌క్ర‌మంలో వ్య‌వ‌హ‌రించార‌ని అందులో పేర్కొన్నారు. ఆదితోపాటు ఆ స్క్రిప్ట్‌ రైటర్‌, మ‌ల్లెమాల సంస్థ‌పై కూడా ఫిర్యాదు చేశారు. ఏసీపీని క‌లిసిన‌వారిలో తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడ‌రేష‌న్‌, స‌మాచార హ‌క్కు సాధ‌న స్ర‌వంతి , టీ ఎస్‌యూ త‌దిత‌ర సంస్థ‌ల‌కు చెందిన నేత‌లున్నారు. త‌మ మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా ఆది స్కిట్ చేశారంటూ సినీ విమ‌ర్శ‌కులు క‌త్తి మ‌హేష్‌, అనాథ‌లు, ప‌లు సంస్థ‌ల ప్ర‌తినిధులు గ‌తంలోనే మాన‌వ హ‌క్కుల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఆది చేస్తున్న స్కిట్స్ విమ‌ర్శ‌లకు దారితీస్తున్నాయి. స‌మాజంలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌ల‌ను వినియోగించుకుంటూ అత‌ను స్కిట్స్ చేస్తుంటారు. ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంటున్న‌ప్ప‌టికీ ఏదో ఒక వ‌ర్గానికి చెందిన‌వారి మ‌నోభావాలు దెబ్బ‌తినేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయితే స్కిట్‌లో భాగంగానే ఇలా చేస్తున్నాంకానీ ఎవ‌రి మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా ఉద్దేశ‌పూర్వ‌కంగా స్కిట్ చేయ‌డంలేదంటూ కార్య‌క్ర‌మం మొద‌ట్లోకానీ, చివ‌ర్లోకానీ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: