తెలంగాణ ప్ర‌భుత్వం భూముల అమ్మాల‌ని తీసుకున్న నిర్ణ‌యం వివాదాస్ప‌దమ‌వుతుంది.భూముల అమ్మ‌కంపై ప్ర‌తిప‌క్షాలు మండిప‌డుతున్నాయి. నిధులు స‌మీక‌ర‌ణ కోసం తెలంగాణ ప్ర‌భుత్వం భూముల‌ను విక్ర‌యించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.అయితే అమ్మ‌కానికి సంబంధించిన క‌స‌ర‌త్తును వేగ‌వంతం చేసింది.దీనిపై మంత్రివ‌ర్గంలో కూడా చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకున్నారు.ఈ నేప‌థ్యంలో ఇటు ప్ర‌తిప‌క్షాలు తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తుతున్నాయి. ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని త‌క్ష‌ణం వెన‌క్కి తీసుకోవాల‌ని ష‌ర్మిలా పార్టీ అధికార ప్ర‌తినిధి ఇందిరాశోభ‌న్ డిమాండ్ చేశారు. లేని ప‌క్షంలో పెద్ద ఎత్తున ప్ర‌జ‌పోరాటం చేస్తామ‌ని ఆమె హెచ్చ‌రించారు.ప్ర‌జ‌ల అవ‌స‌రం కోస‌మే భూముల‌ను వినియోగించాల‌న్నారు.మంత్రులు ఎమ్మెల్యేలు అక్ర‌మంగా ఆక్ర‌మించిన భూముల‌ను స్వాధీనం చేసుకోవాల‌ని ఇందిరా డిమాండ్ చేశారు

మరింత సమాచారం తెలుసుకోండి: