క‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో తెలంగాణ ప్ర‌భుత్వం ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తుంది.ఇప్ప‌టికే ఉద‌యం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరుగంట‌ల వ‌ర‌కు షాపులు తెరిచేందుకు అనుమ‌తి ఇచ్చింది.అయితే ఈ నెల 19 నుంచి  రాత్రి వేళ‌ల్లో మాత్ర‌మే క‌ర్ఫ్యూ విధించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తుంది.వారం నుంచి ప‌దిరోజుల పాటు రాత్రి క‌ర్ఫ్యూ పెట్టేందుకు ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేస్తున్న‌ట్లు స‌మాచారం. రాత్రి 9గంట‌ల నుంచి ఉద‌యం 5గంట‌ల వ‌ర‌కు ఈ క‌ర్ఫ్యూ ఉండ‌నుంది. అయితే గ‌తంలో కూడా ఇదే విధంగా క‌ర్ఫ్యూ పెట్టిన‌ప్ప‌టికి త‌రువాత కేసులు పెర‌గ‌డంతో లాక్‌డౌన్ ని అమ‌లు చేశారు.తాజాగా క‌రోనా కేసులు త‌గ్గుతుండ‌టంతో ప్ర‌భుత్వం మ‌ళ్లీ ఈ నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్లు తెలుస్తుంది.వచ్చే నెల నుంచి బార్లు, సినిమా థియేటర్లు, జిమ్‌కు 50 శాతం ఆక్యుపెన్సీతో అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. కరోనా కేసుల, మరణాలు గణనీయంగా తగ్గినందున ప్రభుత్వం అన్‌లాక్‌ దిశగా ఆలోచిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత కరోనా పరిస్థితులపై రాష్ట్ర వైద్య శాఖ ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చింది. రాష్ట్రంలో పాజటివ్‌ రేటు 1.5 శాతానికి తగ్గినట్లు పేర్కొంది.రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆంక్షలను సడలించక తప్పడం లేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: